వైభవంగా గోదావరి మహా హారతి
మంథని, ఆంధ్రప్రభ : మంథని గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ(Catham Venkataramana) ఆధ్వర్యంలో మంథని గోదావరి ఉత్సవ సమితి సభ్యులు వైభవంగా నిర్వహించారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మంథని గోదావరి సమీపంలో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా గ్రామ వికాస్ విభాగ్ సంయోజక్ జంగపల్లి రాజేష్(Jangpalli Rajesh) హాజరై మాట్లాడారు.
హిందూ సాంప్రదాయ పద్ధతులు కొనసాగించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. గౌతమ మహర్షి తపస్సు వలన గోదావరి నది ఉద్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ… గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని 2012 వ సంవత్సరం నుండి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గోదావరి మాతకు కుంభహారతి, నక్ష హారతి, కర్పూర హారతి, ధూప హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త కొత్త శ్రీనివాస్ గుప్తా, గోదావరి హారతి(Gupta, Godavari Harathi) ఉత్సవ సమితి సభ్యులు గర్రెపల్లి వెంకన్న, మేడగోని రాజమౌళి గౌడ్, బత్తుల సత్యనారాయణ, నాంపల్లి రమేష్, బోయిని నారాయణ, నారమల్ల కృష్ణ, రావుల సతీష్, కొమురవెల్లి హరీష్ గుప్తా, మాదాడి నరేందర్ రెడ్డి, ఈసంపల్లి వెంకన్న, సామల అశోక్, బొల్లంపల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

