గోవా : గోవా 20వ గవర్నర్ (Governor) గా పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఇవాళ ప్రమాణ స్వీకారం (Sworn) చేశారు. ఈ మేరకు గవర్నర్ బంగ్లా దర్బార్ (Governor’s Bangla Darbar) హాలులో ఆయనతో గోవా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of High Court) అలోక్ అరాధే (Alok Aradhe) ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో పాటు ఆ రాష్ట్ర మంత్రివర్గం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.
