ఆంధ్రప్రభ, ఘంటసాల : ఆంధ్రుల తొలి రాజధాని(The first capital) ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో వేంచేసిన శ్రీకాకుళేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల సందర్భంగా శనివారం శాంతి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది.
ఈ పవిత్ర మహోత్సవానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్(Buddhaprasad), విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాకుళేశ్వరస్వామి దర్శించుకొని, ప్రత్యేక పూజలు జరిపించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు(Dasari Srirama Varaprasad Rao) ఆధ్వర్యంలో వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనాలు అందించి, శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
ఉదయం నుంచి దేవస్థానం ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు(Bhaskaracharya) నేతృత్వంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పవిత్ర విసర్జన, మహా పూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం అత్యంత ఆధ్యాత్మిక(Spiritual) వాతావరణంలో శ్రీ స్వామివార్లకు శాంతి కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), నేతలు కుంపటి చిట్టిబాబు, శీలం శ్రీనివాస్, దాసం రామకృష్ణ(Dasam Ramakrishna), కొండవీటి నాని, కోటి, వినయ్, శ్రీను పాల్గొన్నారు.

