Global Oil Crisis 2026 : నయా కరోనా Anadhra Prabha SPL Story

Global Oil Crisis 2026 : నయా కరోనా Anadhra Prabha SPL Story

  • ప్రపంచంలో ఎనర్జీ ఎమర్జెన్సీ
  • 2000 నౌకలు స్థంభన
  • చిక్కులో.. భారత నౌకలు
  • అల్లాడుతున్న చైనా, జపాన్, కొరియా
  • గల్ఫ్ దేశాల ఎగుమతులు నిలిపివేత
  • భారత్‌లో కృత్రిమ కొరత
  • పానిక్ బాయింగ్‌తో పెరిగిన ఇంధన వినియోగం
  • తెలుగు రాష్ట్రాల్లో వదంతులు
  • విపరీతంగా డిమాండ్ పెరుగుదల
  • చిరు వ్యాపారులపై గ్యాస్ భారం
  • హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ధరల పెరుగుదల
  • కమర్షియల్ సిలిండర్ ధరల షాక్
  • బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయాలు
  • భవిష్యత్తులో పరిస్థితి ప్రశ్నార్థకం

( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ ప్రతినిధి)

Global Oil Crisis 2026

తాజాగా నయా కరోనా జడలు విప్పింది. ప్రపంచాన్ని చుట్టి ముట్టేపింది. ఆయిల్​ మంటలు సెలరేగిపోతున్నాయి. అనేక దేశాలు అత్యవసర స్థితిని ప్రకటించాయి. ఇంతకీ ఈ నయా కరోనా అంటే.. కోవిడ్​ 19ను వైరస్​ కాదు.. ఇది అయిల్​ వైరస్​. ఇంటర్నేషనల్​ ఆయిల్​ మాఫియా అంటించిన వైరస్​ ఇది. ఇజ్రాయెల్​, ఇరాన్​ మధ్య జగడం కాస్త.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఆయిల్​ మాఫియా చేతికి చిక్కింది. ఇరాన్​ చేతిలో హోర్మజ్​ జలసంధి బంధీ కాగా.. ఈ ఆయిల్​ వారధిని విముక్తి చేసేందుకు అగ్రరాజ్యాలు నానా తంటాలు పడుతున్నాయి, ఈ లోపు ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్న వైనం వర్ణనాతీతం.

Global Oil Crisis 2026 : 2000 నౌకలు స్థంభన

Global Oil Crisis 2026

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో సుమారు 2,000 నౌకలు ఈ ప్రాంతంలో చిక్కుకున్నాయి. వీటిలో కనీసం 85 భారీ ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి. దాదాపు 37 భారతీయ నౌకలు (1,100 మందికి పైగా సిబ్బందితో) ఈ నీటిలో చిక్కుకుని బిక్కుబిక్కు మంటున్నాయి, దౌత్య చర్చల తర్వాత ‘పైన్ గ్యాస్’ ‘జగ్ వసంత్’ వంటి కొన్ని నౌకలు సురక్షితంగా బయటపడ్డాయి. సాధారణంగా రోజుకు 100 నుంచి 135 నౌకలు ప్రయాణిస్తే.. తాజాగా ఈ మార్గంలో, రోజుకు కేవలం 9 నౌకలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక ఇక్కడే తిష్ట వేయలేక చాలా నౌకలు ఆఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్తున్నాయి, దీనివల్ల ప్రయాణ సమయం ఖర్చులు భారీగా పెరిగాయి.

Global Oil Crisis 2026 : దక్షిణ ఆసియా అతలాకుతలం

Global Oil Crisis 2026

Global Oil Crisis 2026 : ప్రపంచ దేశాల్లో పరేషాన్​

Global Oil Crisis 2026

సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ , ఖతార్ దేశాల ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. ఖతార్ తన ఎల్ఎన్‌జీ (LNG) ఎగుమతులపై ‘ఫోర్స్ మెజ్యూర్’ (అనివార్య కారణాలతో సరఫరా నిలిపివేత) ప్రకటించింది. పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం తీవ్రంగా ఉంది. పెట్రోల్ ఆదా కోసం వారానికి 4 రోజుల పనిదినాలను అమలు చేస్తూ, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ లో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంధన వినియోగంపై కఠిన ఆంక్షలు విధించారు. శ్రీలంక , బంగ్లాదేశ్: ఇంధన రేషనింగ్ (పరిమిత సరఫరా) ప్రారంభించాయి. పాఠశాలలు . ప్రభుత్వ కార్యాలయాలకు పని గంటలు తగ్గించాయి. హోర్ముజ్ జలసంధిని తప్పించుకోవడానికి ఎర్ర సముద్రం (Red Sea) వైపు ఉన్న పశ్చిమ రేవుల ద్వారా ఆయిల్​ ఎగుమతులు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సౌదీ అరేబియా వెతుకుతోంది.

Global Oil Crisis 2026 : బ్లాక్​ మాఫియా ఆగడం

Global Oil Crisis 2026

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $120 మార్కును దాటింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దౌత్య చర్చలు జరిగితే తప్ప ఈ ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. భారత్: చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల్లో ఆందోళన వల్ల వంటగ్యాస్ (LPG) కొరత, ధరల పెరుగుదల కనిపిస్తోంది. రష్యా వంటి ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Global Oil Crisis 2026 : భారత్ లో కృత్రిమ కొరత

భారత్ లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. భారతదేశం వద్ద సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు మరో 25 రోజులకు సరిపడా పెట్రోల్/డీజిల్ నిల్వలు (మొత్తం 50 రోజులు) ఉన్నాయని అంచనా. అయితే, అత్యవసర నిల్వలు (SPR) కేవలం 6 రోజులకు మాత్రమే సరిపోతాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో నో స్టాక్​ బోర్డులతో తప్పుడు వార్తల వల్ల ప్రజలు ఆందోళనతో (Panic Buying) బంకుల వద్ద క్యూ కడుతున్నారు.

Global Oil Crisis 2026 : తెలుగు రాష్ట్రాల్లో.. ఆయిల్​ తెగులు

Global Oil Crisis 2026

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,000 కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని, కొరత లేదని సివిల్ సప్లైస్ కమిషనర్ తెలిపారు. తెలంగాణ: సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సుమారు 3,000 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవుతుంది. కానీ వదంతుల వల్ల అది ఒక్కసారిగా 6,400 కిలోలీటర్లకు (రెట్టింపు) పెరిగింది. తెలంగాణలో రోజుకు సుమారు 2.5 లక్షల ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. నో స్టాక్​ వదంతులను నమ్మి బాటిళ్లు, క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ఇలా అమ్మే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏపీలో కూడా పరిస్థితి సాధారణంగానే ఉంది.

Global Oil Crisis 2026 : చిక్కుల్లో చిరు వ్యాపారులు

Global Oil Crisis 2026

హైదరాబాద్ నగరంలో సుమారు 74,800 పైగా రెస్టారెంట్లు , తినుబండారాల కేంద్రాలు ఉన్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో గ్యాస్ ధరల పెరుగుదల వల్ల చిరువ్యాపారుల అల్లడిపోతున్నారు. విశాఖపట్నంలో సుమారు 65,000 – 70,000 మంది (పెద్ద పారిశ్రామిక నగరం కావడంతో వలస కార్మికుల కోసం నడిచే మెస్‌లు ఇక్కడ ఎక్కువ). విజయవాడ నగరంలో సుమారు 45,000 – 50,000 మంది (రాజకీయ, వ్యాపార కేంద్రం కావడంతో ఫుడ్ కోర్టులు, తోపుడు బండ్ల వ్యాపారం ఇక్కడ ప్రధానం). తిరుపతి పుణ్యక్షేత్రంలో సుమారు 25,000 – 30,000 మంది (యాత్రీకుల తాకిడి వల్ల హోటళ్లు చిన్నపాటి తినుబండారాల దుకాణాలు అధికం). ఈ ప్రధాన నగరాల్లో చిరువ్యాపారానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి లక్షలాది మంది వీధి వ్యాపారులు (Street Vendors), టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, చిన్నపాటి కేటరింగ్ యూనిట్లు గ్యాస్ పైన ఆధారపడి నడుస్తున్నాయి. వీధి వ్యాపారులు/చిన్న స్టాళ్లు: రోజుకు సగటున ₹3,000 నుండి ₹5,000 వరకు వ్యాపారం చేస్తారు. చిన్న హోటళ్లు/టిఫిన్ సెంటర్లు టర్నోవరు రోజుకు ₹15,000 నుండి ₹25,000 మధ్య ఉంటుంది.

Global Oil Crisis 2026 : ధర చిక్కదు ,. గ్యాస్​ దొరకదు..

Global Oil Crisis 2026

గ్యాస్ ధరలు పెరగడం సరఫరాలో అంతరాయం (Shortage)తో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . పెరుగుతున్న ఖర్చుల వల్ల చిన్న హోటళ్లు , మెస్‌లలో భోజనం, టిఫిన్ ధరలను 15% నుండి 30% వరకు పెంచారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹2,000 దాటింది. అంతర్జాతీయ సంక్షోభం వల్ల ఈ నగరాల్లో వ్యాపార శైలి మారుతోంది, విశాఖ, విజయవాడలోని హోటళ్లలో మీల్స్ ధరను ₹10 నుండి ₹20 వరకు పెంచారు. టీ, కాఫీ ధరలు ₹12 నుండి ₹15కి చేరాయి.

Global Oil Crisis 2026 : బ్లాక్ మార్కెట్ షాక్​

Global Oil Crisis 2026

సరఫరా తగ్గడంతో విజయవాడ వంటి ప్రాంతాల్లో సిలిండర్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. తెలంగాణ (హైదరాబాద్) లో ₹2,105.50. ఏపీ విజయవాడ/గుంటూరులో ₹2,042.50 నుండి ₹2,052.00 మధ్యలో ఉంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే కమర్షియల్ సిలిండర్ ధర సుమారు ₹115 నుండి ₹144 వరకు పెరిగింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో కమర్షియల్ సిలిండర్‌ను ₹4,000 నుండి ₹7,000 వరకు అమ్ముతున్నట్లు సమాచారం.

ALSO READ : US Iran Talks 2026 : రాజీతంత్రం !? Andhra Prabha Latest News

Leave a Reply