గ్లోబల్ స్థాయిలో …

గ్లోబల్ స్థాయిలో …
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్శిటీ(Mahindra University), అకాడమిక్ పరిశోధన రంగాల్లో సహకారాన్నిపెంపొందించడానికి ఒక కీలకమైన అడుగుగా, మోనాష్ యూనివర్శిటీ(Monash University)తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు బుధవారం హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీలో ప్రకటించింది.
మోనాష్ ఇంజినీరింగ్ ఆస్ట్రేలియాలో #2 ప్రపంచవ్యాప్తంగా #59 స్థానంలో ఉంది. ఈ భాగస్వామ్యం పలు ముఖ్యమైన రంగాలపై దృష్టి పెడుతుంది. సంయుక్త పరిశోధన కార్యక్రమాలు, అకాడమిక్ మెటీరియల్స్, స్కాలర్స్ మార్పిడి, సంయుక్త సదస్సులు, వర్క్‌షాప్‌లు ఇతర అకడమిక్(Academic) కార్యక్రమాల నిర్వహణ చేయనున్నట్లు తాము విడుదల చేసిన ప్రకటనలో మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మేడూరి, మోనాష్ యూనివర్శిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (ఇంటర్నేషనల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ క్రెగ్ జాఫ్రీ(Professor Craig Jaffrey) తెలిపారు.
ఈ సహకారంతో విద్యార్థులకు 2+2 ప్రోగ్రాం అవకాశం లభిస్తుంది. దీని ద్వారా వారు తమ చదువులో చివరి రెండు సంవత్సరాలను మోనాష్ యూనివర్శిటీలో పూర్తి చేసుకోవచ్చని వివరించారు. ఈ అవగాహన అకడమిక్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచిందన్నారు
డా. యజులు మేడూరి, వైస్ ఛాన్సలర్(Vice-Chancellor), మహీంద్రా యూనివర్శిటీ, మాట్లాడుతూ.. ఈ అవగాహన ద్వారా మేము మోనాష్ యూనివర్శిటీతో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషంగా ఉంది. మా విద్యార్థులు ఫ్యాకల్టీకి జ్ఞాన మార్పిడి(Knowledge Exchange for Faculty)కి కొత్త అవకాశాలను సృష్టించడం మా లక్ష్యం.
విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించే మా ఉమ్మడి కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. మహీంద్రా యూనివర్శిటీలో మేము మా విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్(Global Exposure) ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రొఫెసర్ క్రెగ్ జాఫ్రీ, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (ఇంటర్నేషనల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మోనాష్ యూనివర్శిటీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా-ఇండియా(Australia-India) ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందన్నారు.
