ధర్మపురి, ఆంధ్రప్రభ : రాజారం గ్రామ ప్రజలు టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని రాజారం సర్పంచ్ అభ్యర్థి రంగు అశోక్ కోరారు. శనివారం ఆయన పెద్ద ఎత్తున గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం మరోసారి అవకాశం కల్పించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
రంగు అశోక్ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేసిన కృషి గ్రామస్తులకు తెలిసిందే. అందువల్ల, ప్రజలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

