మరో అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

ధర్మపురి, ఆంధ్రప్రభ : రాజారం గ్రామ సర్పంచిగా మరో అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రంగు అశోక్ ఓటర్లను కోరారు. ఆదివారం రాజారం గ్రామంలో వివిధ కూడళ్లలో, అలాగే ఇంటింటా తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో సర్పంచ్‌గా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశానని తెలిపారు. మరో అవకాశం కల్పిస్తే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అవసరమైన నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు కేటాయించిన టూత్‌పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
