IND vs PAK | గిల్ అవుట్.. భారత్ స్కోర్ ఎంతంటే !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్న గిల్… ఔటయ్యాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసిన గిల్ 17.3 ఓవర్లో అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో వికెట్ పారేసుకున్నాడు.
అయితే, 5వ ఓవర్లో టీమిండియా తొలి వికెట్ కొల్పొయన సమయంలో… వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి శుభమన్ గిల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు.
కాగా, ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (35) – శ్రేయస్ అయ్యర్ (3) ఉన్నారు. 19వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోర్ 107/2