GHMC |నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో మొత్తం 15 కీలక అంశాలపై చర్చించనున్నారు. నగర అభివృద్ధి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం పనుల కోసం భూసేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. హెచ్ సిటీ ప్రాజెక్టుల భూసేకరణ సంబంధించి ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూములను సేకరించేందుకు అనుమతిని ఇవ్వనుంది. మిధాని బస్ స్టాండ్, బస్ డిపో నిర్మాణం కోసం 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి NOC జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు
ఈ సమావేశంతో ప్రస్తుత స్టాండింగ్ కమిటీ గడువు ముగుస్తుంది. మార్చి 1న స్టాండింగ్ కమిటీ అధికార కాలం ముగియనుంది. మరో ఐదు రోజుల్లో కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి.