GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక 25న జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి.