Ghat Road | ఇది మహిమానిత క్షేత్రం
- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
Ghat Road | జగ్గయ్యపేట , ఆంధ్రప్రభ : పవిత్ర కృష్ణా నది తీరంలో కొలువై ఉన్న శ్రీ వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం మహిమా నిత క్షేత్రమని శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ సంభాషణ చేశారు. శనివారం జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి సమీపంలోని కృష్ణా నది తీరంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొండపై స్వయంభు శ్రీ జ్వాల నరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే ఘాట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. శిలా పథకాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, పలు పరిశ్రమల ప్రతినిధులతో కలసి చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.
డాక్టర్ ఉప్పాలపాటి శ్రీహరి సహచరుల సహకారంతో నిర్మించిన ఈ ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ, ఈ ఘాట్ రోడ్డుతో భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడనుందని, వేదాద్రి క్షేత్ర అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెసిపి రాంకో పరిశ్రమల ప్రతినిధులు ఆలయ కార్య నిర్వహణ అధికారి సురేష్ బాబు భక్తులు పాల్గొన్నారు

