Ghanpur | కాంగ్రెస్ వార్ వన్‌సైడ్ విజయం

Ghanpur | కాంగ్రెస్ వార్ వన్‌సైడ్ విజయం
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నిక పూర్తి
చైర్మన్‌గా తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ)
వైస్ చైర్మన్‌గా నీల రాజమ్మ
Ghanpur | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పద వులకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికలను ప్రిసైడింగ్ అధి కారి, రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజర య్యారు. వీరిలో 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 5 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను ముందుగా క్యాంపు నుంచి బస్సులో తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా కార్యాల యానికి తీసుకువచ్చి పార్టీ లైన్‌పై సూచనలు ఇచ్చారు. అనంతరం సీఐ జి.వేణు ఆధ్వర్యంలో ఎస్ఐలు వినయ్ కుమార్, రాజేష్ భద్రతా ఏర్పా ట్ల మధ్య కౌన్సిలర్లను కార్యాలయానికి తరలించారు. అనంతరం బీఆర్ ఎస్ కౌన్సిలర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు. సంఖ్యాబలం కాంగ్రెస్ వైపే ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వన్‌సైడ్‌గా సాగింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చైర్మన్, వైస్ చైర్మన్లకు ఆర్డీఓ నియామక పత్రాలు అందచేత
మున్సిపల్ చైర్మన్ పదవికి తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) పేరును 2వ వార్డు కౌన్సిలర్ గుర్రం హరినాథ్ ప్రతిపాదించగా, 15వ వార్డు కౌన్సి లర్ బొల్లు లక్ష్మి బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి నీల రాజమ్మ పేరు ను 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సి లర్ అంగడి రజిత బలపరిచారు. సమావేశానికి హాజరైన సభ్యులంతా అనుకూలంగా చేతులు ఎత్తడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రిసైడింగ్ అధికారి డి.ఎస్.వెంకన్న ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు. సభా మందిరం ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
మొత్తం మీద స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధి పత్యం మరోసారి స్పష్టమైంది. సంఖ్యాబలం, సమన్వయం కలిసివచ్చి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో మున్సిపాలిటీ పాలన పూర్తిగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లినట్టైంది. అభి వృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని కొత్తగా ఎన్నికైన ప్రజాప్ర తినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీఓ
1వ వార్డు తాటికొండ మధు (బిఆర్ఎస్ ), 2వ వార్డు గుర్రం హరినాథ్ (కాంగ్రెస్ ), 3వ వార్డు గుర్రం హైమ (కాంగ్రెస్ ), 4వ వార్డు బూర్ల రాజేశ్వర్ (బిఆర్ఎస్ ), 5వ వార్డు చల్లా రమ్య (బిఆర్ఎస్ ), 6వ వార్డు బాలగాని అనిల్(బిఆర్ ఎస్), 7వ వార్డు అన్నెపు సుమలత (కాంగ్రెస్ ), 8వ వార్డు పొన్న రాజేష్ (బిఆర్ఎస్ ), 9వ వార్డు సౌదరపల్లి సంపత్ రాజు(కాంగ్రెస్ ), 10వ వార్డు తోకల అనూష(కాంగ్రెస్ ), 12వ వార్డు గట్టు సంగీత(కాంగ్రెస్ ), 14వ వార్డు పెసరు కృష్ణవేణి(కాంగ్రెస్), 15వ వార్డు బొల్లు లక్ష్మి(కాంగ్రెస్), 16వ వార్డు అంగడి రజిత(కాంగ్రెస్), 17వ వార్డు పొన్న స్వరూప(కాంగ్రెస్ ),18వ వార్డు పొన్న రవి (కాంగ్రెస్ ) వీరందరని ఆర్డీవో డి.ఎస్. వెంకన్న ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువప త్రాలు అందజేశారు.

