ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఈ రోజు చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి(Madhusudan Reddy), సీఐ మన్మథ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్(RTC Bus Stand) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మధ కుమార్ మాట్లాడుతూ చట్టాలు, పోలీసుల విధుల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
చట్టం అందరికీ సమానమేనని, ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కె.యాదగిరి(K. Yadagiri), డి. నర్సిరెడ్డి, కె ఉపేందర్ రెడ్డి, అజయ్ భార్గవ్, సిహెచ్. రమేష్, కృష్ణమాల్, ఏఎస్ఐ లు జానయ్య, కరుణాకర్ తో పాటు పెద్ద ఎత్తున పోలీసులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

