బీఎస్పీ మక్తల్ అధ్యక్షుడిగా గౌతం నియామకం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి)మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ విధికి చెందిన కొక్కు గౌతం, తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నట్లు నారాయణపేట బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు బొదిగేలి శ్రీనివాస్ గురువారం విలేకరులకు తెలిపారు.
నియోజకవర్గఉపాధ్యక్షులుగా పరశురామ్,ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్,కార్యదర్శిగా బస్వరాజ్,కోశాధికారిగా మల్ రెడ్డి లను నియమించినట్లు పేర్కొన్నారు. నియమించిన నూతన కమిటీ సభ్యులు పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పనిచేస్తారని తెలిపారు.
బహుజనులకు రాజ్యాధికారమే బీఎస్పీ అంతమ లక్ష్యమని,ఈ పోరాటంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏకమవ్వాలి ,దోపిడి కుల రాజకీయాలకు బుద్ధి చెప్పాలన్నారు. నూతనంగా మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎంపికైన గౌతం మాట్లాడుతూ బి.ఎస్.పి పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తానని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజల సమస్యల పోరాటానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు బొదిగేలి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
