gathering | ఆత్మీయ సమ్మేళనం

gathering | ఆత్మీయ సమ్మేళనం
- సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం
gathering | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మందోళ్ళగూడెం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ తంగేళ్ళ వెంకటేశంను, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై సర్పంచ్ తంగెళ్ళ వెంకటేశం సమక్షంలో వల్లూరి వెంకటేశ్, లింగస్వామి, శివ, మహ్మద్ ఉస్మాన్ , అన్వర్ తదితరులు బీజేపీలో చేరారు. వారికి సర్పంచ్ వెంకటేశం కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బూత్ అధ్యక్షులు నెట్టు అంజయ్య, సప్పిడి ప్రశాంత్ రెడ్డిల అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెట్టు యాదయ్య, బీజేపీ సీనియర్ నాయకులు మునగాల వెంకట్ రెడ్డి, యాట సత్తయ్య, పరకాల జగదీష్, పగిళ్ల అంజిరెడ్డి, సుర్కంటి మోహన్ రెడ్డి, యాట బాను, యాట మురళి, తదితరులు పాల్గొన్నారు.
