GATE Registrar | ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలన…
GATE Registrar | మోత్కూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పాలడుగు గ్రామంలో ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి వెంకటరమణారెడ్డి(P Venkataramana Reddy) సందర్శించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి గేట్ రిజిస్టర్(GATE Registrar), కొనుగోలు రికార్డులను స్వయంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వహకులకు సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా నాణ్యతా ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
అనంతరం పొడిచేడు గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట వివరాలను ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఏ ఓ కీర్తి, ఏ ఈ ఓ సింహ ప్రసాద్ లు ఉన్నారు.


