Gas Supply | ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు

Gas Supply | ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు
Gas Supply | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. వంట గ్యాస్ కొరతపై ఆందోళనలు పెరగడంతో దేశీయంగా ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
గ్యాస్ సరఫరాపై అనిశ్చితి కారణంగా ఇండక్షన్ స్టవ్‌లు, వాటికి అనుకూల పాత్రలకు వినియోగదారుల డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఇవి ‘హాట్ కేక్స్’లా అమ్ముడవుతున్నాయని సమాచారం.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్ల తయారీని భారీగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డిమాండ్‌కు సరిపడే సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
