Gas leakage | అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

Gas leakage | అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

Gas leakage | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని పోతేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీ కటికల సుబ్బారావు & శ్రీమతి అర్జా లక్ష్మీ(జిల్లా కోర్టు ఉద్యోగి) కుటుంబం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో, వారికి మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం నిర్వహించగా అది విజయవంతంగా పూర్తయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా గృహం పూర్తిగా అగ్నికి ఆహుతై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ పరిస్థితిలో బాధిత కుటుంబానికి మైత్రి ఫౌండేషన్ సభ్యులు గ్యాస్ స్టవ్, మిక్సీతో పాటు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు మానసిక ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పోతేపల్లి గ్రామ పెద్ద కమ్మిలి మధు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, జనసేన ఇంచార్జ్ తోట రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంచార్జ్ కమ్మిలి మధు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా మైత్రి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా పరిశీలిస్తున్నానని తెలిపారు.

ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు కేసాని వేణు కుమార్, ఉపాధ్యక్షుడు రిలాక్స్ ప్రసాద్, అధ్యక్షుడు వరప్రసాద్ , సభ్యులు అనిల్, లక్ష్మణరావు, మాణిక్యాలరావు గారు తదితరులు పాల్గొన్నారు. మైత్రి ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply