అకస్మాత్తుగా మంటలు
గర్భిణీకి తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు
కర్నూలు జిల్లాలో సంచలనం
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీకేజీ (gas cylinder leakage)తో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనలో ఓ గర్జిణీ తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపిది. ఈ అనూహ్చ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలకు గండం తప్పింది. కర్నూలు జిల్లా (Kurnool district) వెల్దుర్తి మండలంలోని బోయనపల్లె గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో గర్భిణీ సువర్ణ (pregnant Suvarna seriously injured) తీవ్రంగా గాయపడ్డారు. ఆమెతో పాటు చిన్న పిల్లలు చరణ్, అనిల్ కూడా గాయాలపాలయ్యారు.

సమాచారం ప్రకారం, నాగరాజు కుటుంబం గ్యాస్ స్టౌవ్ వంట చేసిన అనంతరం వాటిని ఆఫ్ చేయలేదు. ఈ క్రమంలో సిలిండర్ వద్ద గ్యాస్ లీ కై వంట రూమ్ లో వ్యాపించింది. ఇది గమనించని నాగరాజు బీడీ తాగేందుకు వంట రూమ్ లోకి అగ్గిపెట్ట వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నాగరాజు భార్య సువర్ణ సిలిండర్‌ను ఆపేలోపే ఆమె దుస్తులు మంటలు వ్యాపించాయి. గర్భిణీ కావడంతో గాయాల తీవ్రత మరింత ఎక్కువగా మారింది. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు గమనించి, తక్షణమే మంటలను ఆర్పి బాధితులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే సువర్ణ, చరణ్, అనిల్‌లను 108 అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం సువర్ణకు గాయాలు తీవ్రమైనప్పటికీ, ప్రాణాపాయం లేదని తెలిపారు.
గ్రామంలో భయాందోళన
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో కలకలం రేపింది. మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుతుందేమోనన్న భయంతో కొందరు గ్రామస్థులు కొంతసేపు బయటే గడిపారు.
అధికారుల స్పందన
సమాచారం అందుకున్న వెంటనే వెల్దుర్తి పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్యాస్ లీక్ కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో సిలిండర్ కనెక్షన్‌లో లోపం కారణమై ఉండవచ్చని అధికారులు తెలిపారు.
జాగ్రత్తలే రక్షణ
ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాడే ముందు సిలిండర్, కనెక్షన్ పైపు సరిగా ఉన్నాయా లేదా అని తప్పక పరిశీలించాలన్నారు.