Garbage | చెత్తను తొలగించేదెవరు?

Garbage | హనుమకొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజలు పన్నులు చెల్లిస్తూ, వరంగల్ పురపాలక కార్యాచరణకు సహకరిస్తున్నారు. అలాంటి వారికి పారిశుధ్య కార్యాచరణ (Sanitation activity) సక్రమంగా నిర్వహించక పోవడం దురదృష్టకరం. అందుకు నిదర్శనంగా ఇటీవల 11 గంటల తరువాత చార్బౌలి వాటర్ ట్యాంక్ సమీపంలో చెత్తను తొలగించలేదు. ప్రస్తుతం పురపాలక కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఆటో నగర ప్రాంతంలో 12: 26 సమయానికి చెత్తను తొలగించలేదు. చెత్తను తొలగించే బాధ్యత ఎవరిదన్న సందేహం ప్రశ్నార్థకమైంది. పారిశుధ్య పనులు చేయకపోతే దుర్వాసనల(Odors) కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
