బిఆర్ఎస్ నాయకురాలి ఆశీర్వాదం పొందిన వధూవరులు

పరకాల, ఆంధ్రప్రభ : నూతన వధూవరులను బిఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షురాలు గంట కళావతి ఆశీర్వదించారు. పరకాల పట్టణంలోని 12వ వార్డుకు చెందిన అజ్మీర విజయ బలరాం నాయక్ దంపతుల కుమారుడు సాయి కుమార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని డీపీఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివాహ విందులో పరకాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
