Gannavaram MLA | పిల్లలకు చుక్కలు వేయించాలి

Gannavaram MLA | పిల్లలకు చుక్కలు వేయించాలి
- గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
Gannavaram MLA | గన్నవరం, ఆంధ్రప్రభ : ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో నివారణ చుక్కల మందు వేయించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. ఆదివారం ఉదయం గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో నివారణ చుక్కల మందు వేసి నియోజకవర్గంలో పల్స్ పోలియోను యార్లగడ్డ ప్రారంభించారు. ముస్తాబాద్ పీహెచ్సీ పరిధిలో 4844 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 29 బూత్ లతో పాటు నాలుగు ట్రాన్సిట్లు, ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అధ్వాన స్థితిలో ఉన్న గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ఇప్పటికే హెచ్ సి ఎల్ సంస్థ తమ సీఎస్ఆర్ నిధులతో వైద్యశాలకు జనరేటర్ ఏర్పాటు చేసిందని, కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో ఈ వైద్యశాలలో అధునాతన హంగులతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు యార్లగడ్డ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడపాటి తులసి మోహన్, కొమ్మరాజు సుధీర్, పడమట రంగారావు, బోడపాటి రవి, దేవినేని సులోచన, జాస్తి శ్రీధర్, కాసర్నేని రంగబాబు, గొంది శివ కోటేశ్వరరావు, అన్నే హరికృష్ణ, డాక్టర్ సృజన, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
