Gandhi Bhavan | సమన్వయ లోపం లేకుండా ముందుకు…

Gandhi Bhavan | సమన్వయ లోపం లేకుండా ముందుకు…
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ …
Gandhi Bhavan |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రాజకీయాల్లో దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీ (BJP)కి ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ రోజు గాంధీభవన్ (Gandhi Bhavan)లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళతామని టీపీసీసీ చేఫ్ స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల(welfare schemes)ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, స్పోర్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ మూలంగానే కొన్ని స్థానాలు కోల్పోయామని.. బీఆర్ఎస్ పార్టీ కొంత లబ్ధి పొందిందని అన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం పైగా స్థానాలను గెలుచుకున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో 25 వేలకు పైగా మెజార్టీతో గెలిచామని.. ఆ ఫలితాలే కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 90శాతం పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన తెలిపారు.
