ప|| పార్వతీ పరమేశ్వరులకూ ప్రధమ పుత్రుడూ
విఘ్నేశ్వరుడు పార్వతీ తనయకు నీరాజనం.
అను|| ప్రధమ పూజలందే విఘ్నములను తొలగించే
వినయమున తల్లి తండ్రులకు నమస్కరించీ
గణాధ్యక్షుడు నీలకంఠుని తనయునకూ గణపతికీ నీరాజనం.
చ|| గజాననుడుగా, కర్ణచామరములతో స్వయం
సిద్ధ బీజాపూర స్కంధాగ్రజునకూ ఏకదంతునకు
లంబోదరునకూ భక్తుల విఘ్నము
వినాశము చేసే గౌరీ కృపానిధి పుత్రునకూ నీరాజనం.