Gaddar Cini Awards | 2014 – 23 వ‌ర‌కు గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల జాబితే ఇదే

హైద‌రాబాద్ – గద్దర్ సినీ అవార్డులను 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్ల కాలానికి గాను నేడు ప్రకటించారు. 2014 జూన్ 2 త‌ర్వాత సెన్సార్ అయిన చిత్రాల‌ నుంచి డిసెంబ‌ర్ 2023 వ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌లో ప్ర‌తీ సంవ‌త్స‌రం మూడు చిత్రాలతో పాటు 6 ప్ర‌త్యేక అవార్డులు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి – చక్రపాణి అవార్డులతో పాటు అదనంగా పైడి జయరాజ్, కాంతారావు పేర్ల‌తోనూ అవార్డులను మీడియా స‌మ‌క్షంలో జ్యూరీ చైర్మ‌న్ ముర‌ళీ మోహ‌న్‌ ప్ర‌క‌టించారు. ఉత్త‌మ సినీమాల జాబితాలో ర‌న్ రాజా ర‌న్, రుద్ర‌మ‌దేవి, శ‌త‌మాన భ‌వ‌తి, బాహుబ‌లి 2, మ‌హాన‌టి, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురం, ఆర్ ఆర్ ఆర్, సీతారామం, బ‌ల‌గం మూవీల‌కు ఉన్నాయి. ఇక బాల‌కృష్ణ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ల‌భించింది.

కాగా మురళీమోహన్ ఛైర్మన్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ కమిటీలో దర్శకుడు కె. దశరథ్‌, నిర్మాత డి.వి.కె. రాజు, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు, నర్తకి వనజా ఉదయ్, దర్శకుడు కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. కూడా సభ్యుడిగా ఉన్నారు.

ఉత్త‌మ చిత్రం 2014:
ర‌న్ రాజా ర‌న్
పాఠ‌శాల
అల్లుడు శీను

ఉత్త‌మ చిత్రం 2015:

రుద్ర‌మ దేవి
కంచె
శ్రీమంతుడు

ఉత్త‌మ చిత్రం 2016:

శ‌త‌మానం భ‌వ‌తి
పెళ్లి చూపులు
జ‌న‌తా గ్యారేజ్‌

ఉత్త‌మ చిత్రం 2017:

బాహుబ‌లి2
ఫిదా
ఘాజీ

ఉత్త‌మ చిత్రం 2018:
మ‌హాన‌టి
రంగ‌స్థ‌లం
కేరాఫ్ కంచ‌ర‌పాలెం

ఉత్త‌మ చిత్రం 2019:
మ‌హ‌ర్షి
జ‌ర్సీ
మ‌ల్లేశం

ఉత్త‌మ చిత్రం 2020:
అల వైకుంఠ‌పురంలో
క‌ల‌ర్ ఫొటో
మిడిల్ క్లాస్ మెలోడిస్‌

ఉత్త‌మ చిత్రం 2021:
ఆర్ ఆర్ ఆర్
ఆఖండ
ఉప్పెన‌

ఉత్త‌మ చిత్రం 2022:
సీతారామం
కార్తికేయ‌2
మేజ‌ర్‌

ఉత్త‌మ చిత్రం 2023:

బ‌ల‌గం
హ‌నుమాన్
భ‌గ‌వంత్ కేస‌రి

ఎన్టీఆర్ జాతీయ అవార్డు: బాల‌కృష్ణ
పైడి జయరాజ్ అవార్డు: మ‌ణిర‌త్నం
బి.ఎన్. రెడ్డి అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు: అట్లూరి పూర్ణ‌ చంద‌ర్ రావు
కాంతారావు అవార్డు: విజ‌య్ దేవ‌ర‌కొండ
రఘపతి వెంకయ్య అవార్డ్: యండమూరి వీరేంద్రనాథ్

Leave a Reply