Gaanja | గంజాయి గ్యాంగ్ అరెస్ట్..

Gaanja | గంజాయి గ్యాంగ్ అరెస్ట్..

Gaanja, చిత్తూరు, ఆంధ్రప్రభ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముద్దాయిలను పలమనేరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 31,500 రూపాయలు విలువ గల 2 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లాలో అక్రమ విక్రయాలు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ భద్రతా చర్యలు చేపడుతూ.. జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలలో భాగంగా పలమనేరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు గంజాయి, ఇతర మత్తుపదార్ధాల పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ క్రమంలో పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ సమాచారం మేరకు ఉదయం సుమారు 11.00 గంటలకు పెద్దపంజాని మండలం, రామాపురం గ్రామ సమీపాన బసాపురం క్రాస్ వద్ద ఇన్స్పెక్టర్, పెద్దపంజాని PSI మారెప్ప, సిబ్బంది A1 షైక్ మస్తాన్, A2 శ్యామలను గంజాయిని విక్రయిస్తుండగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా A2 ముద్దాయి శ్యామల తాను విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి పెద్దపంజానిలో A1 ముద్దాయి షేక్ మస్తాన్ తో కలిసి విక్రయిస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగిందని పలమనేరు డి.ఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు.

వీరిపై cr.no :Cr. No 149/25, u/s 20(b), 2(b) of NDPS act కింద పంజాని పోలీస్, (Police) పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ముద్దాయిల వివరాలు: A1 – షేక్ మస్తాన్, వయస్సు : 57 సం. లు, తండ్రి : అజీజ్ సాబ్, శంకరాయల పేట, పంజాని మండలం, చిత్తూరు జిల్లా. A2 – శ్యామల, వయస్సు : 30 సం. లు, w/o శివ, భగత్ సింగ్ కాలనీ, పుంగనూరు, చిత్తూరు జిల్లా.

Leave a Reply