Future City | ఫ్యూచర్ సిటీపై పెద్ద అంచనాలు

Future City | ఫ్యూచర్ సిటీపై పెద్ద అంచనాలు
హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్వం తానై పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లో నిర్వహించే వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సును మించి లక్షల కోట్లల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అంతర్జాతీయ ఐటీ, ఇతర రంగాల పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు సిద్ధం చేస్తున్నారు.
పరిపాలనలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముగింపులో భాగంగా ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఇన్వెస్టర్ల సమ్మిట్ అంటే.. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్న హైటెక్స్… లేకపోతే.. అదే రేంజ్‌లో మరో కన్వెన్షన్‌లోనో నిర్వహిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక విధంగా ఇది ఆయన ఆత్మ విశ్వాసానికి నిదర్శనమని ఆయన సహచరులు చెబుతున్నారు.
ఫ్యూచర్ సిటీ ప్లాన్లపై నమ్మకం…
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫోర్త్ సిటీ కట్టాలని డిసైడయ్యారు. హైదరా బాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి..అందుకే నాలుగో సిటీగా.. ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అందుబాటులో ఉండటంతో వెంటనే ప్రణాళికలు అమలు చేశారు. ఎలాంటి ప్రతిష్టాత్మక సంస్థ వచ్చినా ముందు ఫ్యూచర్ సిటీనే చెప్పేవారు. ఇప్పుడు అక్కడ కొన్ని సంస్థలకు భూముల కేటాయింపులు అయ్యాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధారాటీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అది సరిపోదని.. నేరుగా ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.
మరో సైబరాబాద్‌లా మార్చే ప్రయత్నాలు…
హైదరాబాద్ మాడు వైపులా పెరిగింది. కానీ శ్రీశైలం హైవే వైపు అనుకున్నంతా పెరగలేదు. అటువైపు నగరాన్ని విస్తరింపచేయడానికి ఫ్యూచర్ సిటీ ప్లాన్లు చాలా బాగా ఉపయోగపడతాయని నమ్మకంగా ఉన్నారు. అందుకే కావాల్సిన మౌలిక సదుపా యాలు కల్పిస్తాం.. అక్కడే పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు. 10 సంవత్సరా ల్లో ‘న్యూయార్క్’లా మారేలా ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడం, నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ భారీ సంస్థల పెట్టుబడుల ప్రకటన రాలేదు. సీఎం సింగరేణి కాలరీస్‌ను 10 ఎకరాల్లో కార్పొరేట్ గ్లోబల్ ఆఫీస్ నిర్మించాలని ఆదేశించారు . వాటితో పాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలే కార్యాలయాలు నిర్మించనున్నాయి.
ఇన్వెస్టర్లను ఆకర్షించగలరా ?
ఇంకా గాడినా పడని ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి చూపిస్తూండటం.. పారిశ్రామిక వర్గాలకూ ఆశ్చర్యమే. అక్కడ ఏమీ లేకపోయినా అక్కడే ఘనంగా సదస్సు నిర్వహించి భవిష్యత్‌లో అక్కడే ఓ గొప్ప నగరం ఉండబోతోందని ఆయన పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో రేవంత్ సక్సెస్ అయి.. ఫ్యూచర్ సిటీ-కి దిగ్గజ కంపెనీలు వచ్చేందుకు.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే .. నగరాల నిర్మాణంలో వివిధ రాష్ట్రాల్ర మధ్య జరుగుతున్న పోటీలో.. రేసులోకి రావొచ్చు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటు-వంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై వెల్లడించారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగ వంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని గుర్తు చేస్తున్నారు.
జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్ లో పెట్టు-బడులకు ముందుకు రావాలని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను చూపనున్నారు. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ వేదికగా ఇన్వెస్టర్లకు, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వెల్లడించనుంది.
అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల తో భారత్ ఫ్యూచర్ సిటీ భారత దేశంలోనే నూతన నగరంగా మారుతుందని, మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని కళ్లకు కట్టనున్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని, తద్వారా ఆయా రంగాలకు కలిగే లాభా లు, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఆహ్వానించే అవకాశం ఉంది.
భారతదేశంలో రోడ్లకు ఎక్కు వగా నేతల పేర్లు ఉంటాయని… హైదరాబాదులో ఆటెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ముఖ్య మైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సీఎం అన్నారు. ఈ దిశగా ఈ సమ్మిట్‌లో అడుగులు పడనున్నాయని చెబుతున్నారు.
