Funds | కృతజ్ఞతలు చెప్పడానికే ఈ ప్రాంతం వచ్చా

Funds | కృతజ్ఞతలు చెప్పడానికే ఈ ప్రాంతం వచ్చా

  • ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
  • గిరిజన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Funds | జైనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలని అది వచ్చేవరకు విశ్రమించమని పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు కృతజ్ఞతలు తెలుపడానికి వచ్చానని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జనగాం భూషిమట్ట గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు.

2023 మార్చిలో నిర్వహించిన తన పాదయాత్రలో తన వెంట ప్రజలు పాదయాత్ర చేస్తూ ప్రజలు తెలిపిన సమస్యలపై ప్రత్యేక డైరీలో రాసుకొని పరిష్కరించే విధంగా బడ్జెట్లో(budget) నిధులు కేటాయిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకే పంచాలని లక్ష్యంతో ఈ ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Funds |

జిమ్గా ముషీగా ఓజ కులస్తులు ఇత్తడితో హస్తా కళల బొమ్మల తయారు చేసుకోవడానికి ఉపాధి కోసం సహాయం అడిగారని వారి కోసం బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నానని దశలవారీగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జైనూర్, ఉట్నూర్ రోడ్డు వెడల్పు కోసం నిధులు(funds) మంజూరు చేసి త్వరలో టెండర్లు వేస్తామని హామీ ఇచ్చారు.

Funds |

స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఏడాదికి 20వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు 100 కోట్లు నిధులు ఇచ్చి మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. జంగం సభా కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల(support groups) మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కును, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. బూషిమెట్ట క్యాంపులో సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్రంలో సందర్శించి పూజలు చేశారు.

Funds |

అనంతరం ఆ గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ… సందర్శించినప్పుడు మహిళలు ఇంట్లోకి తీసుకువెళ్లి తనకు పండుగ సందర్భంగా స్వీట్ రొట్టె తినిపించారని ఈ గ్రామ మహిళలు తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో గిరిజనుల వ్యవసాయ అభివృద్ధికి ఇందిరా జల వికాసం ద్వారా సౌర సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యుత్ సమస్యలు(electricity issues) పరిష్కరించడానికి 108 వాహనం తరాహలో 1912 వాహనాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని ఏ సమస్యలున్న ఆ నెంబర్ కు కాల్ చేయాలని కోరారు.

కార్పొరేట్ స్థాయిలో నిరుపేదలకు విద్య అందించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల(200 crores)తో న్యూ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లను ప్రారంభించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్, గిరిజన టైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ డీసీసీ సహకార రాష్ట్ర చైర్మన్ కోట్నాక్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, మాజీ డీసీసీ విశ్వప్రసాద్, జైనూర్ మార్కెట్ కమిటీ కుడి మేత విశ్వనాథ్ రావు, ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్, పట్నాపూర్ సిద్దేశ్వర సంస్థ అధ్యక్షుడు ఇంగ్లె కేశవ్ దాదా, కార్యదర్శి దుక్రె సుభాష్, రాష్ట్ర నాయకులు గణేష్ రాథోడ్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్ అదనపు ఎస్పి చిత్తరంజన్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ఎంపీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జంగాం సర్పంచ్ పేందూర్ అనసూయ అర్జున్, ఉప సర్పంచ్ సజిత్, ఆసిఫాబాద్ డ్వామా పిడి బానోద్ దత్తరం, డీపీఓ బిక్షపతి గౌడ్, జిల్లా అధికారులు ఎంపీడీవో సుధాకర్ రెడ్డి తాసిల్దార్ ఆడబీర్షావ్, ఎంపీ ఓ ముఖ్య శశి కుమార్, ఏపీఎం శ్రీకాంత్, సిఐ రమేష్, అధికారులు ఉద్యోగులు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Funds |

CLICK HERE TO READ MORE : Towards 2029 | రాజకీయ పునఃప్రయాణానికి సంకేతమా

CLICK HERE TO READ MORE :

Leave a Reply