నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి….

నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి….

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉరవకొండలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బడ్జెట్ 2026 – 27 అవుట్ రీచ్ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు, అభివృద్ధి దిశగా తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర అవగాహనను జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజలకు చేరవేయడమే ఈ అవుట్‌రీచ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

బడ్జెట్‌లో కేటాయించిన, ప్రతి రూపాయి ఎక్కడ, ఎలా వినియోగించాలి అనే విషయంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. గతంలో నిలిచిపోయిన సుమారు 85 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు పేర్కొంటూ, వాటి నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకతను పెంపొందించడం ద్వారా బడ్జెట్ ప్రయోజనాలు సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి అఖిల, ఎంపీడీవో రవి ప్రసాద్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply