Funding | అదనపు గదులు లేక చెట్ల కిందనే విద్యాబోధన..
- చలికాలం ఆరు బయట ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థిని విద్యార్థులు
Funding | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు(students) చెట్ల కిందనే విద్యాబోధన అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన గదులకు నిధులు మంజూరై ప్రొసీడింగ్ లెటర్(proceeding letter) రావడం దానికి సంబంధించిన కాంట్రాక్టర్ వచ్చి భూమి పూజ చేపట్టడం జరిగింది.
అలాగే నూతన భవన పనులు ప్రారంభించేందుకు ఉన్న కాస్త పాతగా ఉన్నటువంటి రేకుల షెడ్లను కూలగొట్టడం జరిగింది. అంతలోనే బిఆర్ఎస్ అధికారం పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఉన్న కాస్త నిధులు(Funding) విడుదల కాకపోవడంతో సదర్ కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్లిపోవడంతో గదులు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి పాఠశాలకు అదనపు గదులు మంజూరయ్యేలా చూడాలని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

