విజయవాడ- హైదరాబాద్ హైవేపై…

4 కి.మీ మేర నిలిచిన వాహనాలు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దసరా పండుగకు పల్లెలకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జాం అయ్యింది. ఆదివారం కూడా వాహనాల రద్దీ ఏర్పడింది. వరుసగా రెండో రోజూ సోమవారం కూడా నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కి.మీ మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో వెహికిల్స్ నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది.

నెమ్మదిగా ముందుకు..
పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం ప్రాంతాల వద్ద వెహికిల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చింతలకుంట ఫ్లైఓవర్‌పై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌జామ్ కారణంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
