ఇకనుండి వాట్సాప్ లోనే విద్యుత్ సేవలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇకనుండి విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్ ద్వారానే పరిష్కరించబడుతాయని ఎన్పీడీసియల్ సర్కిల్ సూపర్డెంట్ రాజన్న అన్నారు.ఈ సందర్భంగా ఆయన దండేపల్లి విద్యుత్ కార్యాలయంలో ఆవరణలో మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు విద్యుత్ వలన ఏమైనా సమస్యలు ఏర్పడితే 7901628348 నంబర్ కు హాయ్ అని పంపితే చాలు.విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగదారుల ముంగిట్లోకి తెస్తుందని అన్నారు. వినియోగదారులు ఎవరు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఫిర్యాదు నమోదు చేసే విధానం: వినియోగదారులు తమ మొబైల్ నుండి 7901628348 నంబరుకు వాట్సాప్లో హాయ్అని మెసేజ్ పంపాలి. వెంటనే ‘హాయ్.. ఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ కు వెళ్ళిపోతుంది,దీనితో రిజిస్టర్ కంప్లైంట్ ట్రాక్ కంప్లైంట్ అని ఎంచుకున్నాక, మీ విద్యుత్ కనెక్షన్ (విద్యుత్ మీటర్ నంబర్ ) వివరాలతో లేదా వివరాలు లేకుండా కూడా ఫిర్యాదు చేయవచ్చు. సర్వీస్ నంబర్ నమోదు చేయగానే వినియోగదారుని వివరాలు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించాక (ఒకే చేశాక), మెనూలో సమస్య రకాన్ని ఎంచుకోవాలన్నారు. దీనితో తమ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply