BUS| కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సులో ప్రయాణించి నారా భువనేశ్వరి సంతృప్తి వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి తన ఆధార్ కార్డు చూపించి బస్సు ప్రయాణం చేశారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వయంగా అనుభవించారు. శాంతిపురం మండలం శివపురం లోని తమ స్వగృహం నుంచి తుమ్మిసిలో జరిగే జల హారతి వరకు బస్సు ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన భువనేశ్వరి మహిళలతో కాసేపు మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
BUS| ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణం..

