కల్లెడలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

కల్లెడలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
కడెం, ఆంధ్ర ప్రభ : కడెం మండలంలోని కల్లెడ గ్రామంలో ఆదివారం భవాని పిల్లల హాస్పిటల్ జన్నారం డాక్టర్ కశ్యప్ శ్రీ వాత్సవ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరమును నిర్వహించారు శిబిరంలో డాక్టర్ ఎస్ కశ్యప్ శ్రీ వాత్సవ ( ఎండి పిల్లల వైద్య నిపుణులు ) పిల్లలను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే లయన్స్ క్లబ్ బెల్లంపల్లి వారు ఉచిత నేత్ర పరీక్షలు చేయించారు నేత్ర వైద్యులు డాక్టర్ షేక్ అయేషా షేక్ రహీమ్ ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కల్లెడ గ్రామ సర్పంచ్ తాటి రుక్మిణీదేవి సంజీవ్ పటేల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు, భవాని హాస్పిటల్ నిర్వాహకులు కాండ్రపు రవీందర్ లయన్స్ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బరుపటి రమేష్ అవునూరి శంకర్ కోడిమల నర్సయ్య కొడిమల కొమురయ్య తాటి ప్రణయ్ పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి మంగళవారం భవాని పిల్లల హాస్పిటల్ జన్నారంలో ఉచితంగా ఓపి చూడబడునని నిర్వాహకులు కాండ్రపు తెలిపారు.
