అంధ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త జ్ఞాన బోధ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ నగర పరిధిలోని లూయిస్ అంధుల పాఠశాలలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ ఈ శిబిరానికి సేవలందించారు.
ఈ శిబిరం ద్వారా పాఠశాలలోని 27 మంది అంధ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం వారికి అవసరమైన వస్తువులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటెం అండాలు, కెమిస్ట్ రవి, డ్రైవర్ సారంగం, పాఠశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
