భార్య‌కు ఫ్రీ.. భ‌ర్త‌కు డ‌బుల్ టికెట్‌

భార్య‌కు ఫ్రీ.. భ‌ర్త‌కు డ‌బుల్ టికెట్‌

ఉట్నూర్, ఆంధ్రప్రభ : బస్ భవన్ ముట్టడికి బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపునివ్వడంతో ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌(Police Station)కు తరలించారు. అరెస్టు అయిన వారిలో బీఅర్‌ఎస్ వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్, మాజీ వైస్ ఎంపీపీ సలీముద్దీన్‌(Salimuddin)తో పాటు బీఆర్ ఎస్ నాయకులు కాటం రమేష్, సిడం సోనే రావు పటేల్, కుర్సెంగ భూమన్న, పడేదాం శ్రీకాంత్‌ల‌కు పోలీసులు వారి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా(Adilabad District) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ధరణి రాజేష్, ఉట్నూర్ మాజీ ఎంపీపీ సలీమొద్దిన్ మాట్లాడుతూ.. 20 నెలల్లో 5 సార్లు అడ్డగోలుగా బస్ ఛార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్(Double) చేశారు. ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్.

వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు. కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా? ప్రజాస్వామ్య పాలనా? అని రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ టీసీ( RTC) ధరలు తగ్గించే వరకు బీఆర్ ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంద‌ని తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాటం ముందు ఆనాటి అక్రమ అరెస్టుల ముందు, ఆనాటి ముఖ్యమంత్రి బెదిరింపులను సైతం లెక్క చేయని బీఆర్ఎస్ ఈ రోజు మీ పిట్ట బెదిరింపులకు బయపడదని అక్రమ అరెస్టులను సహించమని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు ఎన్ని సార్లయిన అక్రమ అరెస్టులు అవడానికి భయపడేది లేదన్నారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేసి ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడం మానుకుంటే మంచిదని తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారా? అక్రమ అరెస్ట్ లు అప్రజాస్వామికమని ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

Leave a Reply