ఉచిత కంటి అద్దాల పంపిణీ..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని వెల్మకన్నె, అంతంపేట గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సౌజన్యంతో, ఆయన మాతృమూర్తి పేరిట నడుస్తున్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న మునుగోడులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వెల్మకన్నె, అంతంపేట గ్రామాలకు చెందిన బాధితులు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 35 మందిని కంటి అద్దాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి శుక్రవారం కంటి అద్దాలను పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ రావుల స్వప్న రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నూర్ మొహమ్మద్, అంతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మాధగోని వెంకటేష్ పాల్గొని బాధితులకు అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు టేకుమట్ల శ్రీరాములు, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు బాలం మహేష్, సిపిఐ మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భీమనపల్లి లింగస్వామి, రావుల సత్తయ్య, వనం వెంకటయ్య, మాతంగి యాదయ్య, గూడెపు జలంధర్, పూసపాటి శంకరప్ప, వెంకటయ్య, మారయ్య, మాధగోని యాదయ్య, కోటప్ప తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply