వృద్దుడిపై ఫోక్సో కేసు

అసలు ఏం జరిగింది..?


గన్నవరం, అక్టోబర్ 27 (ఆంధ్రప్రభ) : కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గం ఉంగుటూరు మండలం నారయ్య అప్పారావుపేటలో ఓ వృద్ధుడు తొమ్మిది ఏళ్ల మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిమ్మకూరీ రత్నం (70) వృద్ధుడు అదే ప్రాంతానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని స్థానికులు గుర్తించారు.

విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వృద్ధుడిని నిలదీశారు. తానేమి చేయలేదంటూ వృద్ధుడు బుకాయించాడు. దీంతో తల్లిదండ్రులు బాలికను అడగగా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుసుకున్నారు. ఈ సంఘటన పై ఆదివారం రాత్రి ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై నరసింహమూర్తి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

Leave a Reply