AP | బాలుడు కిడ్నాప్.. హత్య?

AP | బాలుడు కిడ్నాప్.. హత్య?

మేనమామే నిందితుడు
తలుపులలో సంఘటన


AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai district) కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని గరికపల్లి గ్రామంలో నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్ (Harshavardhan) అదృశ్యమైనట్లు తెలిసింది. ఈమేరకు తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు, సమీప బంధువులు గాలింపు చేపట్టగా, నంబుల పూలు కుంట మండలం తూర్పు నడుంపల్లి, గౌకన పేట అడవి ప్రాంతంలో విగతజీవిగా పడినట్లు గురువారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తలుపుల మండలం గరికపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్( 4) బుధవారం ఉదయం యధావిధిగా గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ కు వెళ్ళాడు. ఇంతలో సదురు బాలుడు అక్క వచ్చి అమ్మ పిలుస్తోంది రావాలంటూ ఇంటికి పిల్చుకొని వచ్చింది.

అప్పటికే బాలుడిని హతమార్చాలని ఒక పథకంతో ఉన్న ప్రసాద్ బాలుని ఏపీ కుంట మండలం గౌకనపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి గంగాధర్ తన బావ ప్రసాద్ (Prasad) కుమారుడు జబ్బుతో ఉన్న కారణంగా వైద్యం కోసం కొంత డబ్బు అడిగాడు. అయితే ఇందుకు గంగాధర్ (Gangadhar) నిరాకరించి, డబ్బు ఇవ్వలేదు.. దీంతో ప్రసాద్ గంగాధర్ పై కసి పెంచుకొని, ఒక పథకం ప్రకారం హర్షవర్ధన్ ను హతమార్చినట్లు డీఎస్పీ శివ నారాయణ తెలిపారు. ఈ సంఘటనతో ఇటు తలుపుల మండలంలోని అటు ఎన్పీ కుంట మండలంలో తీవ్ర సంచలనం కలిగించింది.

ఎమ్మెల్యే కందికుంట స్పందన…


తలుపుల మండలం గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు మిస్సింగ్ పై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ (Kadiri MLA Kandikunta Venkata Prasad) ఆరా తీశారు. బాలుడు కిడ్నాప్ విషయాన్ని టీడీపీ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గరికిపల్లి రామకృష్ణారెడ్డి, వీర భార్గవ్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందిస్తూ.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కదిరి రూరల్ సీఐ నాగేంద్ర గరికిపల్లికి చేరుకొని, గ్రామస్తులతో మాట్లాడి తల్లిదండ్రులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను విచారించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగా బాలుని ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తామని పోలీస్ శాఖ అధికారులు బుధవారం భరోసా కల్పించారు. కానీ ఇంతలోనే ఈ చేదువార్త వినడంతో బాలుడి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, పోలీసులు, అదేవిధంగా ఎమ్మెల్యే కందికుంట తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply