హోటల్ గదిలో విగతజీవులుగా..

హోటల్ గదిలో విగతజీవులుగా..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సాతులూరు గ్రామానికి చెందిన గోపి భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడిగా, ఆయన భార్య శంకర కుమారి అక్కడే నర్సుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చి ఓ లాడ్జిలో గది తీసుకుని కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడ్డారు.


ఈ ఘటనలో శంకర కుమారి, పెద్ద కుమార్తె మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా గోపి, చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply