WGL | కస్తూరి బా గురుకుల పాఠశాలలో నలుగురరు విద్యార్థినులకు అశ్వస్థత…
ఏరియా ఆసుపత్రికి తరలింపు
కేసముద్రం,(ఆంధ్రప్రభ ): కస్తూరి బా గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కేసముద్రం మండలం మహ్మద్ పట్నం కస్తూరి బా బాలికల గురుకుల పాఠశాలలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్నాక్స్ తిన్న తరువాత… ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అశ్వస్థతకు గురయ్యారు.
గమనించిన పాఠశాల నిర్వహకులు వెంటనే వారిద్దరిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై మురళీధర్ రాజ్ కస్తూరి బా పాఠశాలకు వెళ్లి సమీక్షించారు. ఈ క్రమంలో మరో ఇద్దరు విద్యార్థినులు ఇదే పరిస్థితి రావడంతో వారిని ఎస్‌ఎస్‌ఐ దగ్గరుండి అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలించిన విద్యార్థుల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అఖిల, అనూష, ప్రథమ సంవత్సరం విద్యార్థిని సిరి, 8వ తరగతి విద్యార్థిని అంజలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.