నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు..

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు..

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని సావర్ గాం గ్రామశివారులో పేకాట ఆడుతున్నట్టు, పక్కా సమాచారం అందడంతో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తన సిబ్బందితో కలిసి గురువారం రాత్రి పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేయటమే కాకుండా, వారి వద్ద నుండి 2520 రూపాయల నగదును స్వాధీనం పరచుకోవడం జరిగిందని ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. మండల కేంద్రంతో పాటు, మండలంలో ఎక్కడ పేకాట నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని, ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే గ్రామస్తులు తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Leave a Reply