ఉరుసు రంగ సముద్రం బండ్ కు శంకుస్థాపన

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ ఉరుసు రంగసముద్రం బండ్ కు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, మేయర్ గుండు సుధారాణి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హనంకొండ కలెక్టర్ బల్దియా ఇన్చార్జి కమిషనర్ చాహేత్ బాజ్పేయితో కలిసి శంకుస్థాపన చేశారు.
అమృత్ 2.0 పథకం కింద పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ. 3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నగరంలోని 40 వ డివిజన్ ఉర్సుగుట్టలోని రంగ సముద్రం చెరువుపునర్జీవనం కల్పించే పనులనురాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖశుక్రవారం ప్రారంభించారు.కార్యక్రమంలో స్థానిక 40డివిజన్,కార్పొరేటర్ మరుపల్ల రవి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
