విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ కన్నుమూత

గన్నవరం – ఆంధ్రప్రభ : విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93)కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ చైర్మన్ సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషిచేశారు. ఈయన స్వగ్రామం మొవ్వలో ఈ రోజు సాయంత్రం అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానకి రామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 27 సంవత్సరాలు ఈయన విజయ డెయిరీ చైర్మన్ గా పనిచేశారు.
