Nizampet | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..

Nizampet | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..
Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో మంగళవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) 108వ జయంతి వేడుకలను నిజాంపేట (Nizampet) మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ (Indira Gandhi) దేశంలో గరీబీ హటావో అని దేశంలో బీద ప్రజలు ఉండొద్దని చూసిన తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట సొమ్మ బాబు, సత్యనారాయణ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, సిద్దా గౌడ్, మోహన్ రెడ్డి, బన్నీ గౌడ్, ఎదుగని అంజయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
