మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

  • రామేశ్వర పల్లి గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు తక్కల్ల నరసారెడ్డి

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మండలంలోని రామేశ్వర పల్లి గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు తక్కల్ల నరసారెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించవలసి వస్తుందని తెలిపారు.

దీంతో క్వింటాలుకు 600 రూపాయలు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మార్క్ పేడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. రైతు ప్రభుత్వమని చెబుతున్నా రైతుల సంక్షేమాన్ని ఏమాత్రము పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించారు.

Leave a Reply