Former MLC | నోటీసులు అందుకున్న కవిత భర్త

Former MLC | నోటీసులు అందుకున్న కవిత భర్త

Former MLC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై దర్యాప్తు సంస్థ సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. నోటీసులను కవిత భర్త అనిల్ అందుకున్నారు. ఈనెల 16న ఢిల్లీ హైకోర్టుకు రావాలని నోటీసులిచ్చారు.

Leave a Reply