ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మూడో వార్డు అభ్యర్థి గుజ్జ వీర రాఘవరావు గెలుపు కోసం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ ఓటర్లతో మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply