Former MLA | మేడారంలో మాజీ ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

Former MLA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వాణి దంపతులు పాల్గొని తల్లులను దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున సమ్మక్క సారాలమ్మను దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం జాతర అని జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కోట్లాదిమంది భక్తులు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారని ఆయన అన్నారు.

ప్రతి మేడారం జాతరకు తప్పకుండా అమ్మవారి దర్శనానికి సకుటుంబ సమేతంగా వచ్చి మ్రొక్కుబడులు చెల్లించుకుంటానని అన్నారు. వనదేవతలను దర్శించుకుని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని సమ్మక్క సారలమ్మలను వేడుకున్నానని నరేందర్ తెలిపారు.

Leave a Reply