former cricketer |భారత తొలి తరం టెస్టు క్రికెటర్ కన్నుమూత

former cricketer |భారత తొలి తరం టెస్టు క్రికెటర్ కన్నుమూత
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత తొలి తరం టెస్టు క్రికెటర్ చింగల్‌పుట్ దొరైకన్ను(సీడీ) గోపీనాథ్ కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చెన్నై అడయార్‌లోని తన కూతురి నివాసంలో మరణించాడు. గోపినాథ్ మృతితో భారత క్రికెట్‌లో విషాదం నెలకొంది. గోపీనాథ్ 8 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గోపీనాథ్.. 22 సగటుతో 242 పరుగులు సాధించారు. భారత తొలి టెస్టు విజయంలోనూ భాగమయ్యారు. మద్రాస్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన.. 83 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 42.16 సగటుతో 4259 పరుగులు రాబట్టారు. 9 శతకాలు, 23 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. 14 వికెట్లు పడగొట్టారు. 1951లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌తో గోపీనాథ్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. 1960లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడారు.
తమిళనాడుకు చెందిన సీడీ గోపినాథ్ 1939, మార్చి 1వ తేదిన జన్మించాడు. 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో, రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో మెరిశాడు. దాంతో, భారత్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది.
